Pappu Harischandra: దేవుడు కూడా నన్ను పట్టుకోలేడు, పోలీసులెంత? అంటూ సవాల్ విసిరిన పాత నేరస్తుడు... తామేంటో చూపించిన ముంబయి పోలీసులు!

  • పప్పు హరిశ్చంద్ర అలియాస్ కోప్డీపై అనేక కేసులు
  • ఓ ఇన్ఫార్మర్ ద్వారా పోలీసులకు సవాల్ విసిరిన కోప్డీ
  • చాలెంజ్ ను స్వీకరించిన పోలీసులు
  • పక్కా సమాచారంతో దొంగకు అరదండాలు
Mumbai cops arrests thief who challenged them

పోలీసులు లేకపోతే ఈ సమాజం ఎలా ఉంటుందో సులువుగానే ఊహించవచ్చు. అలాంటి పోలీసులకే ఓ పాత నేరస్తుడు సవాల్ విసిరాడు. ముంబయిలో పప్పు హరిశ్చంద్ర అనే యువకుడు పాత నేరస్తుడు. 26 ఏళ్ల పప్పు హరిశ్చంద్రకు కోప్డీ అనే మారుపేరు కూడా ఉంది. అతడిపై ముంబయిలోని అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. అయితే, ఇటీవల అతడు ఓ ఇన్ఫార్మర్ ద్వారా పోలీసులకు సవాల్ విసిరాడు. దేవుడు కూడా నన్ను పట్టుకోలేడు? ఈ పోలీసులా నన్ను పట్టుకునేది? అంటూ హేళనగా మాట్లాడాడు.

దాంతో ఈ వ్యవహారాన్ని ముంబయి పోలీసులు తమ సత్తాకు పరీక్షగా భావించారు. పప్పు హరిశ్చంద్ర రాయల్ పామ్ ఏరియాలో ఓ దొంగతనానికి పథకం వేశాడన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎత్తుకు పైఎత్తు వేశారు. సాధారణ పౌరుల్లా ఆ ప్రాంతానికి వెళ్లారు. పక్కా స్కెచ్ తో ఆ పాత నేరస్తుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి దేశవాళీ పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఐపీసీ, ఆయుధ చట్టం కింద పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. పప్పు హరిశ్చంద్రపై పలు ప్రాంతాల్లో కేసులు ఉన్న దృష్ట్యా అతడిని ఇతర పోలీస్ స్టేషన్లకు కూడా అప్పగించాలని నిర్ణయించారు.

More Telugu News