Kala Venkata Rao: శ్రీకాకుళం జిల్లా ఎస్పీని కలిసిన కళా వెంకట్రావు, రామ్మోహన్ నాయుడు

Kala Venkatrao and Rammohan Naidu met Srikakulam SP
  • నంది విగ్రహం తరలింపు ఘటనలో అచ్చెన్న అరెస్ట్
  • అచ్చెన్న సీడీ ఫైల్ కోర్టుకు పంపే బాధ్యత పోలీసులదేనన్న కళా
  • రాష్ట్రంలో వ్యవస్థలు పనిచేయడం లేదని వ్యాఖ్యలు
  • చట్టాన్ని చుట్టంగా చూస్తే వ్యవస్థలు నీరుగారిపోతాయని విమర్శలు
సంతబొమ్మాళి మండలం నంది విగ్రహం తరలింపు వ్యవహారంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీని టీడీపీ నేతలు కళా వెంకట్రావు, రామ్మోహన్ నాయుడు, కూన రవి కలిశారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ, అచ్చెన్న సీడీ ఫైల్ ను సోమవారం కోర్టుకు పంపే బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలు, చట్టాలు పనిచేయడంలేదని విమర్శించారు. అధికార పార్టీ చట్టాన్ని చుట్టంగా చూస్తే వ్యవస్థలు నీరుగారిపోతాయని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీపై మానసిక ఒత్తిడి తెచ్చేలా అధికార పార్టీ వ్యూహం అమలు చేస్తోందని ఆరోంచారు.
Kala Venkata Rao
Kinjarapu Ram Mohan Naidu
Kuna Ravi
Srikakulam District
SP
Atchannaidu
Telugudesam

More Telugu News