Chandrababu: ఒంగోలులో బీటెక్ విద్యార్థిని కాలేజి ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకుందన్న వార్త కలచివేసింది: చంద్రబాబు

  • ప్రకాశం జిల్లా ఒంగోలులో విద్యార్థిని బలవన్మరణం
  • విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యలు
  • ఫీజు రీయింబర్స్ మెంట్ ఏమైందంటూ ఆగ్రహం
Chandrababu reacts over student suicide in Ongole

ఒంగోలులో ఓ విద్యార్థిని బలవన్మరణం చెందిందన్న వార్తపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. ఒంగోలులో బీటెక్ చదువుతున్న తేజస్విని అనే విద్యార్థిని కాలేజీ ఫీజులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకుందన్న వార్త తన మనసును కలచివేసిందని తెలిపారు. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం అని తెలిపారు. తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేదన్నప్పుడు ప్రభుత్వం ఏంచేస్తోందని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఏమైందని చంద్రబాబు నిలదీశారు. నాడు నేడు అంటూ పనికిమాలిన కబుర్లు చెబుతూ విద్యావ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంతో భవిష్యత్తు ఉన్న యువత నిరాశావాదంతో ప్రాణాలు తీసుకుంటోందని వ్యాఖ్యానించారు. వెంటనే విద్యార్థుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, తేజస్విని కుటుంబానికి సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News