Yuri Dushechkin: లైవ్ లో ఒకటిన్నర లీటరు వోడ్కా తాగాడు... అందరూ చూస్తుండగానే మృతి చెందాడు!

Russian old man dies after consuming vodka in a live stream
  • రష్యాలోని స్లొమెన్ స్క్ నగరంలో ఘటన
  • యూట్యూబర్ విసిరిన సవాలు స్వీకరించిన వృద్ధుడు
  • మద్యం, లేక ఘాటైన సాస్ కానీ తాగాలన్న యూట్యూబర్
  • వోడ్కా తాగేందుకు సిద్ధపడిన వృద్ధుడు
  • డబ్బుకు ఆశపడి ప్రాణాలు కోల్పోయిన వైనం
రష్యాలో విషాద ఘటన జరిగింది. ఓ వృద్ధుడు వోడ్కా తాగే పందెంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. యూరి డుషెచ్కిన్ అనే 60 ఏళ్ల వృద్ధుడు లైవ్ స్ట్రీమింగ్ లో అందరూ చూస్తుండగా 1.5 లీటర్ల వోడ్కా మద్యం తాగాడు. అయితే, వీక్షకులు చూస్తుండగానే యూరి మరణించాడు. ఓ యూట్యూబర్ విసిరిన సవాలు స్వీకరించిన యూరి లైవ్ లో వోడ్కా తాగేందుకు సిద్ధపడ్డాడు. డబ్బులు వస్తాయన్న ఆశతో బాగా మత్తెక్కించే వోడ్కా బాటిల్ ను ఎత్తిపట్టాడు.

మద్యం కానీ, లేక ఘాటైన సాస్ కానీ తాగాలన్నది పందెం. దురదృష్టం కొద్దీ యూరి మద్యం తాగేందుకు సిద్ధపడ్డాడు. అయితే, ఒకటిన్నర లీటరు వోడ్కా తాగిన తర్వాత అతడి పరిస్థితి విషమించింది. అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. లైవ్ లో ఇది చూస్తున్న వీక్షకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. రష్యాలోని స్లొమెన్ స్క్ నగరంలో ఈ ఘటన జరిగింది.

కాగా, లైవ్ లో ఇలాంటి పందేలు నిర్వహించడాన్ని ట్రాష్ స్ట్రీమ్స్ అంటారు. రష్యాలో వీటిపై ఎప్పటినుంచో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వీటిని నిషేధించాలన్న డిమాండ్లు తాజా ఘటనతో ఊపందుకున్నాయి.
Yuri Dushechkin
Vodka
Challenge
Youtuber
Live Stream
Russia

More Telugu News