Magisterial Powers: ఎన్నికల అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

  • ఏపీలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియ
  • ఎన్నికల అధికారులకు ప్రత్యేక కార్యనిర్వాహక అధికారాలు
  • ఉత్తర్వులు జారీ చేసిన న్యాయశాఖ
  • నోటిఫికేషన్ ముగిసేవరకు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదా
Magisterial powers to election officers in AP

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, ఎన్నికల అధికారులకు ప్రత్యేక అధికారాలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోనల్, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వీలెన్స్ బృందాల చీఫ్ లకు అధికారాలు కల్పించింది. కృష్ణా, నెల్లూరు, కర్నూలు, విజయనగరం, అనంతపురం, విశాఖ జిల్లా ఎన్నికల అధికారులుగా కలెక్టర్లు నోటిఫై చేసిన వారికి ఈ అధికారాలు అప్పగించింది.

అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు అప్పగిస్తూ ఈ మేరకు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ ముగిసేంతవరకు వీరిని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లుగా గుర్తిస్తారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు ఇవ్వాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వారం కిందట ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు ఇచ్చినట్టు అర్థమవుతోంది.

More Telugu News