VV Vinayak: పవన్ కల్యాణ్ సినిమాలో ప్రముఖ దర్శకుడు?

Vinayak to play important role in Pawans film
  • అప్పుడప్పుడు తెరపై కనిపించే వీవీ వినాయక్ 
  • 'ఠాగూర్', 'ఖైదీ నెంబర్ 150'లలో నటన
  • 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ లో పాత్ర
  • ఇప్పటికే షూటింగులో పాల్గొన్న వినాయక్    
ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ లో మంచి నటుడు కూడా వున్నాడు. అందుకే, అప్పుడప్పుడు ఆయన తెరమీద కూడా ప్రత్యక్షమవుతూ ఉంటాడు. గతంలో అలా 'ఠాగూర్', 'ఖైదీ నెంబర్ 150' వంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. ఈ క్రమంలో తాజాగా మరో చిత్రంలో ఆయన నటిస్తున్నట్టు సమాచారం. అది కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా కావడం ఇప్పుడు పెద్ద విశేషంగా చెప్పుకుంటున్నారు.

మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులోనే వీవీ వినాయక్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన షూటింగులో కూడా ఆయన ఇటీవల పాల్గొన్నట్టు, గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన షూటింగులో ఆయనపై చిత్రీకరణ జరిగినట్టు సమాచారం. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేను సమకూర్చడమే కాకుండా, మాటలు కూడా రాస్తున్నారు.
VV Vinayak
Pawan Kalyan
Trivkram Srinivas

More Telugu News