Rajashekhar: స్పీడు మీదున్న రాజశేఖర్.. మరో కొత్త సినిమా ప్రకటన

Rajashekhar announces another movie
  • వరుస సినిమాలను ప్రకటిస్తున్న రాజశేఖర్
  • 91వ చిత్రంగా 'శేఖర్' ఇప్పటికే ప్రకటన
  • 92వ చిత్రానికి కిరణ్ కొండమడుగుల డైరెక్షన్  

ఆమధ్య కోవిడ్ బారిన పడి కోలుకున్న ప్రముఖ నటుడు రాజశేఖర్ ఇప్పుడు ఆర్టిస్టుగా మంచి జోరుమీదున్నారు. వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే తన 91వ చిత్రాన్ని ఆయన ప్రకటించారు. 'శేఖర్' పేరుతో రూపొందే ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. మలయాళంలో వచ్చిన హిట్ చిత్రం 'జోసెఫ్'కి రీమేక్ గా దానిని నిర్మిస్తున్నారు. దీనికి లలిత్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ క్రమంలో రాజశేఖర్ నటించే మరో చిత్రాన్ని ఈ రోజు అనౌన్స్ చేశారు. గతంలో 'గతం' అనే చిత్రానికి దర్శకత్వం వహించిన కిరణ్ కొండమడుగుల ఇప్పుడీ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. శివాని, శివాత్మిక, సృజన్, భార్గవ, హర్ష కలసి రాజశేఖర్ నటిస్తున్న ఈ 92వ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ను బట్టి చూస్తే ఇన్వెస్టిగేటివ్, యాక్షన్ మూవీగా ఇది కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News