నక్సల్స్ పై పోరుకు మహిళా కమాండోలు
- 6 బెటాలియన్లకు చెందిన 34 మంది నియామకం
- మూడు నెలల పాటు కఠోర శిక్షణ
- ఆ తర్వాత కోబ్రా బృందంలో బాధ్యతలు
6 మహిళా బెటాలియన్లకు చెందిన 34 మంది మహిళా సిబ్బందిని నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ లో సీఆర్పీఎఫ్ నియమించింది. అందులో భాగంగా వారికి మూడు నెలల పాటు కఠోరమైన శిక్షణను ఇచ్చి కోబ్రా బృందంలో బాధ్యతలు అప్పగించనున్నారు. శిక్షణ పూర్తయిన వెంటనే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో వారిని మోహరించనున్నారు.