allari naresh: నాంది సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేసిన మ‌హేశ్ బాబు

Mahesh Babu says Happy to unveil the trailer of Naandhi Trailer
  • అల్ల‌రి న‌రేశ్ న‌టించిన‌ కొత్త సినిమా నాంది
  • చేయ‌ని నేరానికి జైలు శిక్ష అనుభ‌వించే పాత్ర‌లో న‌రేశ్
  • అల‌రిస్తోన్న డైలాగులు
అల్ల‌రి న‌రేశ్ న‌టిస్తోన్న 'నాంది' సినిమా ట్రైల‌ర్ ను సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేశాడు. ఇందులో అల్లరి న‌రేశ్ చెబుతోన్న డైలాగులు ఆకట్టుకునేలా వున్నాయి. చేయ‌ని నేరానికి జైలు శిక్ష అనుభ‌వించే పాత్ర‌లో ఆయ‌న ఈ సినిమాలో న‌టించిన‌ట్లు తెలుస్తోంది.

నిమిషం 52 సెకనుల నిడివితో ఈ ట్రైల‌ర్ ఉంది. అంద‌రూ త‌న‌ జీవితం ఇక్క‌డితో అయిపోయింది అనుకుంటున్నారని, అయితే, ఇప్పుడే మొద‌లైందని అల్లరి నరేశ్ చెప్పే డైలాగు అల‌రిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, హరీశ్‌ ఉత్తమన్‌, ప్రవీన్‌, ప్రియదర్శి, దేవీ ప్రసాద్‌, వినయ్‌ వర్మ కీలక పాత్రల్లో న‌టించారు.

కొత్త ద‌ర్శ‌కుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాను ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై సతీశ్ వేగేశ్న నిర్మిస్తుండ‌గా, శ్రీచరణ్‌ పాకల సంగీతం అందించారు. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు కూడా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ఈ నెల‌ 19న విడుదల కానుంది.
allari naresh
Mahesh Babu
Tollywood

More Telugu News