Nizamabad District: బంగ్లాదేశీయులకు భారత పాస్‌పోర్టు జారీ.. బోధన్ పోలీసుల కీలక పాత్ర!

  • నిజామాబాద్ నుంచి బంగ్లాదేశీయులకు పాస్‌పోర్టుల జారీ
  • స్పెషల్ బ్రాంచ్ పోలీసుల పాత్ర
  • విచారణ కోసం అనుమానిత పోలీసులను తీసుకెళ్లిన శంషాబాద్ పోలీసులు
 Issuance of Indian passport to Bangla Nationals Nizamabad police behind it

బంగ్లాదేశ్ జాతీయులకు భారత పాస్‌పోర్టులు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. ఈ పాస్‌పోర్టుల జారీ వెనక నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీసుల పాత్ర ఉన్నట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. శంషాబాద్ విమానాశ్రయ పోలీసులు వారిని విచారణ కోసం తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశీయులకు నిజామాబాద్ నుంచి భారత పాస్‌పోర్టులు జారీ అయిన విషయాన్ని గుర్తించిన శంషాబాద్ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేశారు.

గతంలో బోధన్ స్పెషల్ బ్రాంచ్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసి, ప్రస్తుతం సిద్దిపేటలో ఎస్సైగా పనిచేస్తున్న వ్యక్తితో పాటు, బోధన్‌లో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సైగా పనిచేస్తున్న మరొకరు కూడా ఈ పాస్‌పోర్టుల జారీ వెనక ఉన్నట్టు అదికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో కమిషనరేట్ అధికారులను కలిసి వారిద్దరినీ విచారణ కోసం తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ఇలా ఇంకెంతమందికి పాస్‌పోర్టులు జారీ చేసి ఉంటారన్న విషయంపై అధికారులు కూపీ లాగుతున్నారు.

More Telugu News