Andhra Pradesh: ఏపీలో పంచాయతీ ఎన్నికల మూడో దశ.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

Andhrapradesh Panchayat Polls Nominations Accept From Today
  • ఉపసంహరణకు 12వ తేదీ వరకు గడువు
  • 17న ఎన్నికల నిర్వహణ
  • రెండో విడతలో 99,241 నామినేషన్ల దాఖలు
ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల మూడో దశ కోసం నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 12 తుది గడువు. 17న ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఇక, ఈ నెల 13న రెండో విడత ఎన్నికలు జరగనుండగా, మొత్తం 99,241 నామినేషన్లు దాఖలైనట్టు ఈసీ తెలిపింది. సర్పంచ్ స్థానాలకు 19,399 నామినేషన్లు దాఖలు కాగా, వార్డు స్థానాలకు 79,842 నామినేషన్లు దాఖలయ్యాయి. 8న ఉపసంహరణ గడువు అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను వెల్లడించనున్నట్టు ఈసీ వివరించింది.
Andhra Pradesh
Local Body Polls
EC
Third Phase

More Telugu News