Indian Army: తిరుపతి వేదికగా బంగ్లాదేశ్ యుద్ధ విజయోత్సవాలు... సీఎం జగన్ ను ఆహ్వానించిన భారత సైన్యం

  • 1971లో బంగ్లాదేశ్ విమోచన
  • పాకిస్థాన్ పై భారత్ విజయం
  • గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్న భారత ఆర్మీ
  • క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన సైనికాధికారి
Indian army invites CM Jagan to Bangladesh war victory celebrations will be held at Tirupathi

బంగ్లాదేశ్ విమోచన యుద్ధానికి 50 ఏళ్లు అయిన సందర్భంగా భారత సైన్యం గోల్డెన్ జూబ్లీ విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ యుద్ధంలో పాకిస్థాన్ సేనలపై భారత సైన్యం స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ ఫిబ్రవరి 18న తిరుపతిలో వేడుకలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా భారత సైన్యం ఏపీ సీఎం జగన్ ను ఆహ్వానించింది. ఏపీ, తెలంగాణ ప్రాంతాల జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఆర్కే సింగ్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేశారు. సైన్యం ఆహ్వానం పట్ల సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

More Telugu News