COVID19: 44 లక్షల మందికి కరోనా టీకా వేస్తే.. 8,500 మందికే దుష్ప్రభావాలు

  • 19 మంది మృతి.. టీకా కారణం కాదన్న కేంద్రం
  • రాష్ట్రాలు పోస్ట్ మార్టం నివేదికలను పరిశీలిస్తున్నాయని వెల్లడి
  • కరోనా వ్యాక్సిన్లపై 97 శాతం మంది సంతృప్తి
Just 8500 of 44 lakh recipients of Corona Vaccine reported adverse events

ఇప్పటిదాకా దాదాపు 44  లక్షల మందికి కరోనా టీకా వేస్తే 8,563 మందికే దుష్ప్రభావాలు వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో కేవలం 34 మందే ఆస్పత్రుల్లో చేరారని, 19 మంది చనిపోయారని తెలిపింది. అయితే, వారి మరణానికి వ్యాక్సిన్ కారణం కాదని పేర్కొంది. వారందరికీ పోస్ట్ మార్టం చేశారని, సంబంధిత రాష్ట్రాలు, జాతీయ టీకా కమిటీలు వాటిని పరిశీలిస్తున్నాయని తెలిపింది.

కాగా, కరోనా వ్యాక్సిన్ పై ఆ టీకా తీసుకున్న 97 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. తమకు టీకా వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి చెప్పలేదని 11 శాతం మంది అసంతృప్తిని వెలిబుచ్చారు. ఇప్పటిదాకా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 37 లక్షల మందిని కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పై అభిప్రాయాలు అడిగింది. అందులో 5,12,128 మంది తమ మనసులోని మాటను వెల్లడించారు.

వ్యాక్సిన్ వేసే బూత్ లలో అవసరమైనంత మేరకు భౌతిక దూరం పాటిస్తున్నారని 97.4 శాతం మంది చెప్పారు. వ్యాక్సిన్ వేసే క్రమ విధానంపై పూర్తి సమాచారమిచ్చారని 98.4% మంది, టీకా వేసుకున్న తర్వాత అరగంట పాటు వేచి ఉండాలని సిబ్బంది చెప్పారంటూ 97.1% మంది తెలిపారు.

More Telugu News