Nara Lokesh: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు: లోకేశ్

Lokesh alleges that YCP leaders has been attacking due to fears
  • పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాటల యుద్ధం
  • జగన్ రౌడీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయన్న లోకేశ్
  • ధర్మవరం నేత భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆరోపణ
  • పోలీసులకు కనిపించదు, వినిపించదు అంటూ వ్యాఖ్యలు

ఏపీలో పంచాయతీ ఎన్నికల కోలాహలం మరింత అధికమైంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా ఊపందుకుంది. గ్రామాల్లో జగన్ రౌడీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు.

ధర్మవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత సుధాకర్ రెడ్డి ఎన్నికల్లో వైసీపీకి ఓటు వెయ్యకపోతే కాళ్లు విరగ్గొడతా అంటూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని మండిపడ్డారు. వైసీపీ నాయకుల బెదిరింపులు పోలీసులకు మాత్రం వినపడవు, కనపడవు అని లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మానవత్వాన్ని మరిచి మూర్ఖంగా ప్రవర్తించే ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే ధైర్యం పోలీస్ శాఖకు లేదా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News