Somu Veerraju: ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు వైసీపీ, టీడీపీ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు: సోము వీర్రాజు

Somu Veerrajau says YCP and TDP leaders will join BJP in near future
  • వైసీపీ, టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారని వెల్లడి
  • మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తారని వివరణ
  • బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్న సోము
  • వైసీపీ, టీడీపీలకు ఆ దమ్ముందా అంటూ వ్యాఖ్యలు
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రాజకీయ ఎత్తుగడల్లో పదును పెంచారు. వైసీపీ, టీడీపీ నేతలు నిరంతరం తమతో టచ్ లో ఉంటున్నారని వెల్లడించారు. ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ వరకు వైసీపీ, టీడీపీ నేతలు తమతో చర్చలు జరుపుతున్నారని, బీజేపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని వివరించారు. త్వరలోనే ఏపీ బీజేపీలోకి వలసలు ఊపందుకుంటాయని అన్నారు. మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా సోము వీర్రాజు వైసీపీ, టీడీపీలకు సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామని, బీసీని సీఎం చేసే సత్తా వైసీపీ, టీడీపీలకు ఉందా? అని ప్రశ్నించారు. ఏపీలో బీసీలు బీజేపీతో ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలన్నది బీజేపీ అజెండా అని సోము వీర్రాజు పేర్కొన్నారు.
Somu Veerraju
BJP
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News