IYR Krishna Rao: ఈ ప్రభుత్వం కోరుకుంటున్నది కూడా అదేనేమో: ఐవైఆర్‌

iyr on sec comments on elections
  • ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగితే ఎన్నికలు రద్దు
  • రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ విష‌యం చెబుతోంది 
  • ప్రభుత్వానికి అనుకూల ఎన్నికల సంఘం ఈ లోపల ఏర్పడుతుంది
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థ‌ల ఎన్నికల నేప‌థ్యంలో ఎక్క‌డైనా అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌రిగితే అక్క‌డ‌ ఎన్నిక‌లు ర‌ద్దు చేస్తామంటూ క‌లెక్ట‌ర్లకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఏపీ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు త‌న అభిప్రాయాన్ని తెలిపారు.

'ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగితే ఎన్నికలు రద్దు చేయాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అంటోంది. ఈ ప్రభుత్వం కోరుకుంటున్నది కూడా అదే ఏమో. ఇప్పుడు రద్దయితే తిరిగి నిర్వహించడానికి సమయం పడుతుంది. ప్రభుత్వానికి అనుకూల ఎన్నికల సంఘం ఈ లోపల ఏర్పడుతుంది' అంటూ ఐవైఆర్ ట్వీట్ చేశారు.
IYR Krishna Rao
Nimmagadda Ramesh Kumar
Local Body Polls

More Telugu News