Vijayasai Reddy: కాబోయే హోం మంత్రి అచ్చెన్నంట!: విజయసాయిరెడ్డి ఎద్దేవా

Vijayasai reddy response on Atchannaidu comments
  • చంద్రబాబును అడిగి హోం మంత్రి పదవి తీసుకుంటానన్న అచ్చెన్న
  • తప్పుడు కేసులు బనాయిస్తున్న పోలీసుల సంగతి చూస్తామని హెచ్చరిక
  • పోలీసులను బెదిరించేందుకు అచ్చెన్న బిస్కెట్ వేశారన్న విజయసాయి
టీడీపీ నేత అచ్చెన్నాయుడు నిన్న మాట్లాడుతూ.. రాబోయేది టీడీపీ ప్రభుత్వం అని... తమ అధినేత చంద్రబాబుని అడిగి తాను హోం మంత్రి పదవిని తీసుకుంటానని... తమపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసు అధికారులు ఎక్కడున్నా వారి సంగతి చూస్తామని హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. 'కాబోయే హోం మంత్రి అచ్చెన్నంట' అని ఎద్దేవా చేశారు. అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులను బెదిరించేందుకు అచ్చెన్న ఒక బిస్కెట్ వేశారని అన్నారు. చంద్రబాబు చెవిలో చెప్పిన మాటలను బహిరంగపరిస్తే ఎలా అచ్చన్నా? అని కామెంట్ చేశారు. 'మరో ఇద్దరు, ముగ్గురు టీడీపీ నేతలు కూడా తాము ఏ మంత్రులో చెపుతారంట' అని అన్నారు. చంద్రబాబు తన పిచ్చిని అందరికీ అంటించారని ఎద్దేవా చేశారు.
Vijayasai Reddy
YSRCP
Atchannaidu
Telugudesam

More Telugu News