Balakrishna: మే నెల నుంచి బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్

Balakrishna to start his new film from May
  • 'క్రాక్' సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని 
  • గోపీచంద్ చెప్పిన కథకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్
  • బోయపాటి సినిమా అవగానే షూటింగ్ షురూ
  • మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మాణం  
ఇటీవల రవితేజతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'క్రాక్' సినిమా మంచి హిట్ అయిన సంగతి విదితమే. దీంతో దర్శకుడు గోపీచంద్ కు పలు ఆఫర్లు వస్తున్నాయి. అయితే, క్రాక్ కు ముందే తాను బాలకృష్ణతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్టుగా పక్కా మాస్ అంశాలతో ఈయన చెప్పిన కథ బాలయ్యకు బాగా నచ్చడంతో ఆయన కూడా గ్రీన్స్ ఇగ్నల్ ఇచ్చారు. దీంతో గోపీచంద్ ముందుగా ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తన తాజా చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో వస్తున్న ఈ మూడో చిత్రం షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని మే 28న థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తారు. ఇక అదే నెలలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తాను చేయనున్న చిత్రం షూటింగును బాలకృష్ణ ప్రారంభించడానికి డేట్స్ ఇచ్చారట. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తుంది.
Balakrishna
Gopichand Malineni
Boyapati Sreenu

More Telugu News