Bird Flu: వికారాబాద్ జిల్లాలో మృత్యువాత ప‌డుతోన్న వంద‌లాది కోళ్లు, కాకులు

  • దారూర్‌ , యాలాల మండలాల్లో ఘ‌ట‌న‌లు
  • వాటిని పాతిపెట్టకుండా బయట పడేస్తున్న ప్ర‌జ‌లు
  • వాటిని తింటోన్న కాకులు మృత్యువాత
bird flu in vikarabad

కొన్ని రోజుల క్రితం దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో బ‌ర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి రావ‌డంతో క‌ల‌క‌లం రేగిన విష‌యం తెలిసిందే. ఆ కేసులు త‌గ్గు ముఖం ప‌డుతోన్న స‌మ‌యంలో వికారాబాద్‌ జిల్లాలో కోళ్లు, కాకులకు వింత వ్యాధి సోకుతుండ‌డం అల‌జ‌డి రేపుతోంది. వందలాది కోళ్లు చనిపోతున్నాయి.  ప‌లు ప్రాంతాల్లో  కాకులు కూడా ఉన్న‌ట్టుండి మృత్యువాత ప‌డుతున్నాయ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్నారు.

దారూర్‌, యాలాల మండలాల్లోని పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున‌ కోళ్లు చనిపోతున్నాయని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ, అధికారులు చ‌నిపోయిన కోళ్ల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతుండ‌డంతో స్థానికులు వాటిని పాతిపెట్టకుండా బయట పడేస్తున్నారు. దీంతో వాటిని తింటోన్న కాకులు మృత్యువాత‌ప‌డుతున్నాయి.

వాటిని తిన్న‌ కుక్క‌లు కూడా మృత్యువాత ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో వికారాబాద్ జిల్లాలోని ప‌లు ప్రాంతాల ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. చర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు విన్నవించుకుంటున్నారు. వారం రోజులుగా కోళ్లు, కాకులు చ‌నిపోతున్నాయ‌ని చెబుతున్నారు.

More Telugu News