Captain Tom Moore: 100 సంవత్సరాల వయసులో కరోనాతో కన్నుమూసిన బ్రిటన్ 'కొవిడ్ హీరో' కెప్టెన్ టామ్ మూరే!

  • కరోనాను ఎదుర్కొనేందుకు నిధుల సేకరణ ప్రారంభించిన టామ్ మూరే
  •  మిలియన్ డాలర్ల నిధి సేకరణ 
  • సంతాపం వ్యక్తం చేసిన పలువురు
Britain Covid Hero Tom Moore Died with Corona on 100

కెప్టెన్ టామ్ మూరే... ఈ పేరు చెబితే అత్యధికులకు పరిచయం ఉండదేమో కానీ, బ్రిటన్ లో కరోనా వ్యాప్తి ప్రారంభం కాగానే, దాన్ని ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ సమయంలో ఫండ్ రైజింగ్ ఆలోచన చేసిన తొలి వ్యక్తిగా ఆయన పేరు సుపరిచితమే. మిలియన్ డాలర్ల నిధిని సేకరించి, కరోనాపై పోరుకు తనవంతు సాయాన్ని చేసిన టామ్ మూరే, చివరకు అదే మహమ్మారి బారిన పడి కన్నుమూశారు.

ఆయన వయసు 100 సంవత్సరాలు. టామ్ మూరే చనిపోయారని ఆయన కుటుంబీకులు పేర్కొన్నారు. "సెంచరీ హీరో టామ్ మూరే ఇక లేరు. 1920-2021" అంటూ ఆయన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రకటన చేశారు. టామ్ మూరే మరణంపై పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. తన జీవితాంతం ఆయన బ్రిటన్ మేలు కోసం కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.

More Telugu News