BJP: తమిళనాడు ఎన్నికలకు బీజేపీ ఇన్‌చార్జ్‌గా కిషన్‌రెడ్డి

kishan reddy appointed as tamil nadu election incharge
  • త్వరలో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు
  • మంత్రులు, సహాయ మంత్రులకు ఇన్‌చార్జ్ బాధ్యతలు
  • ఆదేశాలు జారీ చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌లు, సహ ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ బీజేపీ కేంద్ర కార్యాలయం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు ఎన్నికల ఇన్‌చార్జ్‌గా తెలంగాణ నేత, హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిని, సహ ఇన్‌చార్జ్‌గా కేంద్ర సహాయమంత్రి వీకే సింగ్‌ను నియమించింది.

అసోం ఇన్‌చార్జ్‌, సహ ఇన్‌చార్జ్‌లుగా కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, జితేంత్రసింగ్‌లను నియమించగా, కేరళ ఇన్‌చార్జ్‌గా ప్రహ్లాద్ జోషి, సహ ఇన్‌చార్జ్‌గా కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్, పుదుచ్చేరి ఇన్‌‌చార్జ్, సహ ఇన్‌‌చార్జ్‌లుగా కేంద్రమంతి అర్జున్ మేఘ్వాల్, ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్‌లను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.
BJP
Tamil Nadu
Telangana
Kishan Reddy

More Telugu News