Annaprasadam: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో అన్నప్రసాద వితరణ పునరుద్ధరణ

AP Government issued orders to revive Annaprasadam Distribution
  • కరోనా వ్యాప్తితో మూతపడిన ఆలయాలు
  • నిలిచిన అన్నప్రసాద వితరణ
  • రాష్ట్రంలో తగ్గిన కరోనా వ్యాప్తి
  • కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్నప్రసాద వితరణకు అనుమతి
  • ఉత్తర్వులు జారీ చేసిన మంత్రి వెల్లంపల్లి
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో అన్నప్రసాద వితరణ నిలిచిపోయింది. భక్తులు అధిక సంఖ్యలో గుమికూడడం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందన్న ఉద్దేశంతో వితరణకు తాత్కాలిక విరామం ఇచ్చారు.

అయితే, వైరస్ వ్యాప్తి నెమ్మదించిన నేపథ్యంలో ఏపీలోని దేవాలయాల్లో అన్నప్రసాద వితరణకు ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ అన్నప్రసాద వితరణ చేపట్టాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉత్తర్వులు ఇచ్చారు. అన్ని దేవాలయాల ఈవోలకు కొవిడ్ నేపథ్యంలో సూచనలు చేశారు. ఈ మేరకు వెల్లంపల్లి శ్రీనివాస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Annaprasadam
Temples
Andhra Pradesh
Vellampalli Srinivasa Rao
Corona Virus

More Telugu News