Esha Rebba: గుణశేఖర్ తాజా చిత్రంలో కీలక పాత్రలో తెలుగమ్మాయి!

Esha Rebba to play key role in Gunashekhars film
  • పలు సినిమాలలో కీలక పాత్రలలో ఈషా రెబ్బ
  • గుణశేఖర్ 'శాకుంతలం'లో లక్కీ ఛాన్స్
  • శకుంతల నెచ్చెలి పాత్రకు ఈషా ఎంపిక    
మన తెలుగు సినిమాలలో తెలుగమ్మాయిలు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. నటనను కెరీర్ గా తీసుకునే తెలుగమ్మాయిలు తక్కువగా ఉండడం.. దానికి తోడు ముంబై భామల్లా గ్లామర్ ను ప్రదర్శించడంలో పరిమితులు పెట్టుకోవడం వల్ల తెలుగమ్మాయిలకు అవకాశాలు తక్కువగా వస్తుంటాయి.

ఈ క్రమంలో ఇటీవల పలు సినిమాలలో కీలక పాత్రలలో రాణిస్తున్న తెలుగమ్మాయిగా ఈషా రెబ్బను చెప్పుకోవచ్చు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది తనకొస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', 'పిట్టకథలు' సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు తాజాగా బిగ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.

సమంత ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ 'శాకుంతలం' పేరిట ఓ పౌరాణిక కథా చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు ఈషాను ఎంచుకున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఆమె శకుంతలకు నెచ్చెలిగా కనిపిస్తుందట. దీనిపై అధికారిక ప్రకటన రావలసివుంది.
Esha Rebba
Gunashekhar
Samantha

More Telugu News