Daggubati Purandeswari: ఏపీకి ప్రధాని మోదీ ఏంచేయడం లేదని అబద్ధాలు చెప్పేవాళ్లు ఈ వివరాలు చూడాలి: పురందేశ్వరి

Purandeswari shares Centre allocations details towards AP
  • మోదీపై విపక్షాల విమర్శలు
  • బడ్జెట్ కేటాయింపుల్లేవంటూ విసుర్లు
  • ట్విట్టర్ లో స్పందించిన పురందేశ్వరి
  • కేంద్రం కేటాయింపుల వివరాలు పంచుకున్న వైనం
ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ ఏంచేయడంలేదని, బడ్జెట్ కేటాయింపుల్లోనూ ఏపీకి మొండిచేయి చూపారని విపక్షాలు ఆరోపిస్తుండడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ఏపీకి మోదీ ఏంచేయడంలేదని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నవాళ్లు ఈ వివరాలను తప్పకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె వివిధ జాతీయ పథకాల కోసం ఏపీకి కేంద్రం విడుదల చేసిన నిధుల వివరాలతో కూడిన పట్టికలను పంచుకున్నారు.

కొవిడ్ నిధులు, పోలవరం ప్రాజెక్టు కేటాయింపులు, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యాన్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, పీఎం కిసాన్, ఈపీఎఫ్ సీ, జన్ ధన్ యోజన వంటి పథకాలకు కేంద్రం ఎంత నిధులు విడుదల చేసిందన్న వివరాలను పురందేశ్వరి ట్వీట్ చేశారు.  తెలంగాణకు కేంద్రం ఎంత కేటాయించిందీ ఈ పట్టికల్లో చూడొచ్చు.
Daggubati Purandeswari
Narendra Modi
Andhra Pradesh
Allocations

More Telugu News