సైబరాబాద్ పోలీసు క్రీడల ముగింపు వేడుకల్లో రామ్ చరణ్ సందడి
- పరేడ్ గ్రౌండ్ లో పోలీసు క్రీడల నిర్వహణ
- ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా రామ్ చరణ్
- స్వాగతం పలికిన సజ్జనార్
- ఫైనల్స్ ముంగిట తుపాకీ పేల్చిన రామ్ చరణ్
బెంజ్ కారులో వచ్చిన చరణ్ ను పోలీసు అశ్వికదళం క్రీడోత్సవాల వేదిక వద్దకు తోడ్కొని వచ్చింది. సైబరాబాద్ పోలీస్ కమిషర్ సజ్జనార్ స్వయంగా వచ్చి స్వాగతం పలికారు. ఆపై రామ్ చరణ్ కు ఓ మొక్కను బహూకరించారు. క్రీడాంశాల్లో ఫైనల్స్ సందర్భంగా రామ్ చరణ్ తుపాకీ పేల్చడం విశేషం. ఈ క్రీడోత్సవాలకు రామ్ చరణ్ రాకతో మరింత ఉత్సాహం నెలకొంది.