Nimmagadda Ramesh: శ్రీనివాస్ రెడ్డి మృతిపై నిమ్మగడ్డ చర్యలు.. సీఐ, ఎస్ లపై చర్యలకు ఆదేశాలు!

SEC Nimmagadda Ramesh order to send CI and SI to VR
  • సర్పంచ్ అభ్యర్థి భర్త అనుమానాస్పద మృతి
  • సీఐ, ఎస్ఐలను వీఆర్ కు పంపాలని ఆదేశాలు
  • కేసును ఎస్పీ స్వయంగా దర్యాప్తు చేస్తారని వ్యాఖ్య

తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంట సర్పంచి అభ్యర్థి పుష్పవతి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఈ ఘటనను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సీరియస్ గా తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన గొల్లలగుంటకు వెళ్లారు. పుష్పవతి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన స్థానిక పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు.

సీఐ, ఎస్ఐలను వీఆర్ కు పంపాల్సిందిగా జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఈ కేసును ఎస్పీ స్వయంగా దర్యాప్తు చేస్తారని నిమ్మగడ్డ చెప్పారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా కఠిన శిక్షను ఎదుర్కోక తప్పదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఘటనను రాజకీయ కోణంలో చూడటం సరికాదని... దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

  • Loading...

More Telugu News