Andhra Pradesh: కాదేదీ గుర్తులకు అనర్హం! తిరగలి, కుండ చెంచా.. సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు ఇవే

EC Released Election Symbols for Panchayat Polls in AP
  • సర్పంచ్ అభ్యర్థులకు 25, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయింపు
  • జిల్లా అధికారులకు పంపిన ఈసీ
  • అభ్యర్థుల జాబితా చివర ‘నోటా’
ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల  కమిషన్ గుర్తులు కేటాయించింది. సర్పంచ్ అభ్యర్థులకు 25, వార్డు సభ్యులకు 20 గుర్తులను కేటాయించిన ఈసీ నిన్న వాటిని జిల్లా అధికారులకు పంపించింది. అభ్యర్థుల జాబితాలో చివరన నోటా గుర్తును పెట్టింది.

సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల్లో.. మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పుసాసర్, క్యారెట్, తాళం చెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, టీవీ, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపళ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, బ్లాక్‌బోర్డు, పైనాపిల్, షటిల్, చేతికర్ర, చెంచా గుర్తులు ఉన్నాయి.

వార్డు సభ్యులకు కేటాయించిన వాటిలో ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూలు, ఇస్త్రీపెట్టె, పోస్టుడబ్బా, గ్యాస్ పొయ్యి, బీరువా, ఐస్‌క్రీమ్, కెటెల్, కటింగ్ ప్లేయర్, గరిట, విద్యుత్ స్తంభం, డిష్ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారంబోర్డు, వయోలిన్, బెండకాయ బెల్టు, కోటు ఉన్నాయి.
Andhra Pradesh
Panchayat Polls
Symbols
EC

More Telugu News