Nominations: ఏపీలో రేపటి నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు

Nominations for second phase Panchayat Elections
  • నిన్నటితో ముగిసిన తొలి విడత నామినేషన్లు
  • ఈ నెల 4వ తేదీ వరకు రెండో విడత నామినేషన్ల స్వీకరణ
  • 13 జిల్లాల్లోని 175 మండలాల్లో ఎన్నికలు
  • 3,335 పంచాయతీలకు, 33,632 వార్డులకు పోలింగ్
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ పూర్తయిన నేపథ్యంలో, రేపటి నుంచి రెండో విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రెండో విడతలో 13 జిల్లాల్లోని 175 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 3,335 పంచాయతీలకు, 33,632 వార్డులకు రెండో విడతలో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 9న, రెండో విడత ఫిబ్రవరి 13న జరగనున్నాయి.
Nominations
Second Phase
Gram Panchayat Elections
Andhra Pradesh

More Telugu News