Twitter: కేంద్రం విజ్ఞప్తి మేరకు 250 ఖాతాలను నిలిపివేసిన ట్విట్టర్

  • రైతుల వధకు మోదీ పన్నాగం అంటూ హ్యాష్ ట్యాగ్ వైరల్
  • రైతు ఉద్యమం నేపథ్యంలో ఫేక్ అకౌంట్లు
  • రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్న కేంద్రం
  • ట్విట్టర్ కు సమాచారం అందించిన కేంద్రం
Twitter blocks fake accounts

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ట్విట్టర్ ఫేక్ అకౌంట్లపై కొరడా ఝుళిపించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి మేరకు 250 నకిలీ ఖాతాలను ట్విట్టర్ నిలిపివేసింది.  రైతు నిరసనల నేపథ్యంలో...  'రైతుల వధకు మోదీ పన్నాగం' అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తూ ఈ నకిలీ ట్విట్టర్ ఖాతాలు కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించారు. జనవరి 30న ఈ ఫేక్ అకౌంట్ల నుంచి రెచ్చగొట్టే, బెదిరించే రీతిలో ట్వీట్లు వచ్చాయని కేంద్రం ట్విట్టర్ కు ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన ట్విట్టర్ నకిలీ ఖాతాలను గుర్తించి బ్లాక్ చేసింది.

దీనిపై ట్విట్టర్ వర్గాలు స్పందించాయి. ప్రతిచోట ప్రజలకు సేవలు అందించే క్రమంలో, ఏ ప్రాంతంలోనైనా అధికార యంత్రాంగం నుంచి ఫిర్యాదులు వస్తే అభ్యంతరకరమైన కంటెంట్ ను నిలుపుదల చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశాయి. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడడంలో పారదర్శకత ఎంతో కీలకం అని ట్విట్టర్ ఓ ప్రకటనలో పేర్కొంది.

More Telugu News