Fire Services: ఏపీ ఫైర్ సర్వీసెస్ ను నాలుగు జోన్లుగా విభజించిన రాష్ట్ర ప్రభుత్వం

  • కర్నూలు కేంద్రంగా రాయలసీమ జోన్
  • విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర జోన్
  • విశాఖ, గుంటూరు కేంద్రాలుగా మరో రెండు జోన్లు
Andhra Pradesh devided into 4 fire services zones

ఫైర్ సర్వీసెస్ ను మరింత బలోపేతం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు జోన్లు ఉన్నాయి. ఈ సంఖ్యను ప్రభుత్వం నాలుగుకు పెంచింది. కర్నూలు కేంద్రంగా చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలతో ఒక జోన్ ను ఏర్పాటు చేసింది. విశాఖ కేంద్రంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

అలాగే, రాజమండ్రి కేంద్రంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలతో ఇంకో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గుంటూరు కేంద్రంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. జోన్లను పెంచడం ద్వారా ఫైర్ సర్వీసెస్ పనితీరు మరింత మెరుగుపడుతుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

More Telugu News