తమ కూతురుకి నామకరణం చేసిన కోహ్లీ, అనుష్క దంపతులు

01-02-2021 Mon 12:48
  • జనవరి 11న బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క
  • కూతురు ఫొటోను తొలిసారి చూపించిన కోహ్లీ దంపతులు
  • ముద్దుల తనయకు వామిక అని నామకరణం
Kohli and Anushka Sharma name their daughter Vamika
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఇటీవలే తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 11న పండంటి ఆడబిడ్డకు అనుష్క జన్మనిచ్చింది. తమ ఇంట లక్ష్మీదేవి అడుగుపెట్టిందంటూ బిడ్డ పుట్టిన రోజు కోహ్లీ తన ఆనందాన్ని పంచుకున్నాడు. తాజాగా తన ముద్దుల తనయ ఫోటోను తొలిసారి అభిమానులకు చూపించారు కోహ్లీ దంపతులు. తమ బిడ్డకు 'వామిక' అని నామకరణం చేసినట్టు అనుష్క తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా అనుష్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'మేమిద్దరం ఎంతో ప్రేమతో కలిసి ఉన్నాం. మా జీవితాలను వామిక మరో స్థాయికి తీసుకెళ్లింది. ఒక్కోసారి కన్నీళ్లు, నవ్వు, ఆనందం, ఆందోళన అన్నీ నిమిషాల్లోనే అనుభూతి చెందుతాం. మీ అందరి శుభాకాంక్షలకు, ప్రార్థనలకు ధన్యవాదాలు' అని తెలిపింది.