100 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందిస్తాం: నిర్మలా సీతారామన్
- విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ తయారు చేయడం జరిగింది
- రూ. 64,180 కోట్లతో ఆరోగ్య రంగంలో ప్రత్యేక నిధి ఏర్పాటు
- లాక్ డౌన్ విధంచకపొతే భారీ నష్టం వాటిల్లేది
ఆరోగ్య రంగంలో రూ. 64,180 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్టు నిర్మల తెలిపారు. దీనికి పీఎం ఆత్మ నిర్భర్ భారత్ ఆరోగ్య పథకంగా పేరు పెట్టినట్టు చెప్పారు. కొత్తగా 9 బీఎస్ఎల్-3 స్థాయి ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. 15 అత్యవసర కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యాక్సిన్ కోసం రూ. 35 వేల కోట్లను కేటాయిస్తున్నామని తెలిపారు. మరో 100 దేశాలకు కరోనా వ్యాక్సిన్ ను అందిస్తామని చెప్పారు. దేశంలో మరో నాలుగు ప్రాంతీయ వైరల్ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.