Nimmagadda Ramesh: తన ఆదేశాలను పట్టించుకోని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ లను ఆఫీసుకు రావాలన్న నిమ్మగడ్డ

  • ఆన్ లైన్ ద్వారా నామినేషన్లు స్వీకరించాలన్న ఎస్ఈసీ
  • ఆదేశాలను అమలు చేయని పంచాయతీరాజ్ శాఖ
  • ఆగ్రహం వ్యక్తం చేసిన నిమ్మగడ్డ రమేశ్
Nimmagadda anger on not taking nominations in online

పంచాయతీరాజ్ శాఖపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. తమ ఆదేశాలను సక్రమంగా అమలు చేయడం లేదని ఇప్పటికే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన నిమ్మగడ్డ... తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ పత్రాలను ఆన్ లైన్ ద్వారా ఎందుకు స్వీకరించలేదని పంచాయతీరాజ్ శాఖను ప్రశ్నించారు. అంతేకాదు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్ లను తన కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించారు.

గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థులను నామినేషన్ వేయనీయకుండా అడ్డుకున్నారని, నామినేషన్ల పత్రాలను చించేశారని పలు పార్టీలు ఆరోపించాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ఆన్ లైన్ ద్వారా కూడా నామినేషన్లు వేసే వెసులుబాటు కల్పించాలని కోరాయి.

More Telugu News