Mayanmar: మయన్మార్ లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న ఇండియా!

  • ఈ ఉదయం మయన్మార్ లో సైనిక తిరుగుబాటు
  • ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించాలి
  • ప్రకటన విడుదల చేసిన విదేశాంగ శాఖ
India Express Deep Concern over Mayanmar Army Coup

మయన్మార్ లో ఈ ఉదయం జరిగిన సైనిక తిరుగుబాటు పట్ల భారతదేశం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని వ్యాఖ్యానించింది.

మయన్మార్ లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించాలని పొరుగున ఉన్న దేశంగా ఇండియా కోరుకుంటోందని, ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తున్నామని పేర్కొంది. ఇటీవల విజయం సాధించిన అంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు ఇష్టపడని సైన్యం, దేశం మొత్తాన్ని తన అధీనంలోకి తీసుకోవడంతో పాటు పలువురు అధికార పార్టీ నేతలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News