IPL 2021: ఈసారి ఐపీఎల్ భారత్ లోనే.... ఏప్రిల్ 11న ప్రారంభమయ్యే అవకాశం!

IPL new season will be started in a few weeks
  • యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్ ఐపీఎల్ పోటీలు
  • త్వరలోనే ఐపీఎల్ తాజా సీజన్
  • భారత్ లో నెమ్మదించిన కరోనా వ్యాప్తి
  • జూన్ 6 వరకు పోటీలు!
సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టీ20 పోటీలను విజయవంతంగా నిర్వహించిన బీసీసీఐ, ఐపీఎల్-2021 సీజన్ ను కూడా భారత గడ్డపై నిర్వహించాలని భావిస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత సీజన్ ను యూఏఈ వేదికగా జరిపిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో కరోనా వైరస్ ప్రభావం గణనీయంగా తగ్గిపోవడం, వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి రావడంతో ఐపీఎల్ ను ఈసారి దేశంలోనే నిర్వహించేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 11 నుంచి 14వ తేదీ మధ్యలో పోటీలను ప్రారంభించి జూన్ 6తో ముగించాలని ఐపీఎల్ పాలకమండలి నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా, పలు ఫ్రాంచైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్ల కోసం ఫిబ్రవరి 18న మినీ వేలం నిర్వహిస్తున్నారు. కాగా, 2022 సీజన్ లో కొత్తగా మరో రెండు జట్లకు స్థానం కల్పించనున్న నేపథ్యంలో ఆ ఏడాది పూర్తిస్థాయిలో వేలం నిర్వహించనున్నారు.
IPL 2021
India
BCCI
Corona Virus
UAE

More Telugu News