Rahul Gandhi: రాహుల్ గాంధీని తక్షణమే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించండి... ఢిల్లీ రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానం

Delhi Congress resolution to elect Rahul Gandhi as party national president
  • కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జూన్ లో ఎన్నికలు
  • ఇటీవలే ప్రకటించిన ఏఐసీసీ
  • రాహులే అధ్యక్షుడంటూ ఢిల్లీ కాంగ్రెస్ స్పష్టీకరణ
  • రాహల్ తోనే పునర్ వైభవం వస్తుందన్ని వెల్లడి
జాతీయ పార్టీ కాంగ్రెస్ లో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వెంటనే ప్రకటించాలంటూ ఢిల్లీ రాష్ట్ర కాంగ్రెస్ విభాగం తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. రాహుల్ గాంధీ పగ్గాలు చేపడితేనే కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం వస్తుందని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు. మోదీ నిరంకుశత్వాన్ని ఎదుర్కోవాలంటే రాహుల్ వంటి నేత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉండడం అవసరమని వారు పేర్కొన్నారు.

ఢిల్లీ కాంగ్రెస్ తాజాగా చేసిన తీర్మానంతో దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ విభాగాలు కూడా ఇదే రకంగా తీర్మానాలు చేయొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఏఐసీసీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికలకు తేదీలు ప్రకటించడం తెలిసిందే. జూన్ లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు చేపట్టాలని ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.
Rahul Gandhi
National President
Congress
Delhi Congress
India

More Telugu News