KTR: టీఆర్ఎస్ కార్యకర్తల ఓపిక నశిస్తే బీజేపీ నేతలు బయట తిరగలేరు: కేటీఆర్

KTR condemns BJP cadre attack on Parakala MLA house
  • పరకాల ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి
  • తీవ్రంగా ఖండించిన కేటీఆర్
  • తమ సహనానికీ ఓ హద్దు ఉంటుందని వెల్లడి
  • బీజేపీ దాడులను ఎదుర్కొనే సత్తా తమకుందని స్పష్టీకరణ
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై బీజేపీ శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో దాడులకు పాల్పడడాన్ని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ భౌతిక దాడులను ఎదుర్కొనే సత్తా టీఆర్ఎస్ కు ఉందని, కానీ బాధ్యతాయుతమైన పార్టీగా ఎంతో సంయమనం పాటిస్తున్నామని వెల్లడించారు. కానీ టీఆర్ఎస్ కార్యకర్తల ఓపిక నశిస్తే మాత్రం బీజేపీ కార్యకర్తలు బయట తిరగలేని పరిస్థితి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అన్న విషయం బీజేపీ నేతలు గుర్తెరగాలని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లోని ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, బలం, బలగం తమకున్నాయని ఉద్ఘాటించారు.

ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు స్థానంలేదని, ప్రజాస్వామ్యంలో తమ వాదనలతో ప్రజలను మెప్పించడం చేతకాక ఇతర పార్టీలపై భౌతికదాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. భౌతికదాడులు చేస్తూ తమ వాదనలు వినిపించాలని ప్రయత్నిస్తున్న బీజేపీ వైఖరిని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని అన్నారు.
KTR
TRS
BJP
Challa Dharma Reddy
Parakala MLA

More Telugu News