Mahmood Ali: అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన మోదీ ఇప్పటివరకు చేసిందేమీ లేదు: మహమూద్ అలీ
- బీజేపీ నుంచి పలువురు టీఆర్ఎస్ లో చేరిక
- మహమూద్ అలీ సమక్షంలో పార్టీ చేరిన నేతలు
- బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతోందన్న అలీ
- సమాజాన్ని విభజిస్తోందని ఆరోపణ
వాల్మీకి సమాజ్ అధ్యక్షుడు ధరంవీర్ సింగ్ తో పాటు పలువురు నేతలు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలో టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మహమూద్ అలీ మాట్లాడుతూ, అభివృద్ధి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం నేటి వరకు ఏమీ సాధించలేకపోయిందని విమర్శించారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తూ సమజాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో మరే నాయకుడు చెయ్యని విధంగా పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా, ఆ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మహమూద్ అలీ అన్నారు. రైతులకు ఉపయుక్తంగా ఉచిత విద్యుత్, బీమా, రైతు బంధు, సాగునీటి పథకాలతో బంజరు భూములను సస్యశ్యామలం చేస్తున్నారని వెల్లడించారు.