Corona Vaccine: చిన్నారులకు అందించే కరోనా వ్యాక్సిన్ వచ్చే అక్టోబరు నాటికి సిద్ధం: సీరమ్

  • కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారుచేస్తున్న సీరమ్
  • పిల్లలకు కూడా వ్యాక్సిన్ తెస్తున్న సీరమ్
  • పుట్టిన పిల్లలకు తొలి నెలలోనే మొదటి డోసు
  • ఈ ఏడాది చివరినాటికి ఇతర వ్యాక్సిన్లు
Serum group EXIM say corona vaccine for children will be out in October

ప్రమాదకర కరోనా వైరస్ ను పారదోలే వ్యాక్సిన్ ప్రస్తుతం అనేక దేశాల్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. భారత్ లోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కొవిషీల్డ్ ను తయారుచేస్తోంది.

 కాగా, సీరమ్ సంస్థ అనుబంధ విభాగం గ్రూప్ ఎగ్జిమ్ డైరెక్టర్ పీసీ నంబియార్ మాట్లాడుతూ, వచ్చే అక్టోబరు నాటికి చిన్నపిల్లలకు వేసే కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ తొలి డోసును చిన్నారులు పుట్టిన తొలి నెలలోనే ఇవ్వాల్సి ఉంటుందని నంబియార్ తెలిపారు.

కాగా, భవిష్యత్తులో చిన్నారులకు కరోనా సోకితే ఈ వ్యాక్సిన్ నే చికిత్సలో ఉపయోగించే ఔషధంగా అభివృద్ధి చేస్తామని వివరించారు. ఇదే కాకుండా, సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేక కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తుందని, అవన్నీ ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

More Telugu News