Beehive: పంట పొలాలు నాశనం చేసే ఏనుగుల గుంపును కట్టడి చేసేందుకు రైతు వినూత్న ఆలోచన!

  • పంట పొలాలను నాశనం చేసే ఏనుగులు
  • తేనెటీగలకు ఆమడ దూరం పోయే ఏనుగులు
  • తన పొలం చుట్టూ తేనెటీగల పెట్టెలు ఏర్పాటు చేసిన ధనేశ్
  • రక్షణతో పాటు స్వచ్ఛమైన తేనె లభిస్తున్న వైనం
Maharashtra farmer set Beehives to prevent Elephant attacks on his farms

అటవీప్రాంతాలకు సమీపంలో ఉండే పొలాలకు ఏనుగుల మంద నుంచి విపరీతమైన ప్రమాదం పొంచి ఉంటుంది. ఏనుగులు పంట నాశనం చేయడమే కాదు, ఒక్కోసారి దాడి చేసి ప్రాణాలు తీస్తుంటాయి. అయితే, మహారాష్ట్రలోని సింధ్ దుర్గ్ జిల్లాకు చెందిన ధనేశ్ పరాశర్ (36) అనే జీడి రైతు ఏనుగుల దాడులకు అడ్డకట్ట వేయడానికి సరికొత్తగా ఆలోచించాడు. ప్రకృతి కల్పించిన మార్గంలోనే ఏనుగులను పారదోలాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం, తన పొలం చుట్టూ తేనెటీగలతో కూడిన పెట్టెలను అమర్చాడు.

ఈ భూమండలంపై అతిపెద్ద జంతువైన ఏనుగు... తేనెటీగలకు భయపడుతుంది. తేనెటీగలు తక్కువ పౌనఃపున్యంతో చేసే ఝుంకారం, అవి విడుదల చేసే ఫెరెమోన్లు (శరీర స్రావాలు) ఏనుగులకు ఏమాత్రం గిట్టవు. తేనెటీగలు ఉన్న ప్రాంతం నుంచి ఏనుగులు దూరంగా వెళ్లిపోతుంటాయి. వాస్తవానికి ఈ విధానం ఆఫ్రికా రైతులు మొదట అనుసరించారు. తమ పొలాలకు తేనెపట్టులతో కంచెను ఏర్పాటు చేసుకున్నారు.

ఇప్పుడు వారి స్ఫూర్తితోనే ధనేశ్ పరాశర్ వంటి మహారాష్ట్ర రైతులు తేనెటీగల బాట పడుతున్నారు. ఏనుగుల నుంచి రక్షణ మాత్రమే కాదు, స్వచ్ఛమైన తేనె కూడా లభిస్తుండడంతో రెండు విధాలా లాభపడుతున్నారు.

More Telugu News