Sasi kala: ఆసుప‌త్రి నుంచి శ‌శిక‌ళ డిశ్చార్జ్‌.. వీడియో ఇదిగో

 VK Sasikala discharged from Victoria Hospital in Bengaluru
  • బెంగ‌ళూరులోని విక్టోరియా ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్న శ‌శిక‌ళ‌
  • అక్రమాస్తుల కేసులో జైలు నుంచి ఇటీవ‌లే విడుద‌ల‌
  • ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌న్న వైద్యులు
త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త జ‌య‌ల‌లిత నెచ్చెలి, ఏఐఏడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ ప్ర‌స్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆమె కొన్ని రోజుల నుంచి బెంగ‌ళూరులోని విక్టోరియా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోన్న విష‌యం తెలిసిందే.

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన ఆమె శిక్షా కాలం ముగియ‌డంతో ఇటీవ‌లే   విడుదలయ్యారు. దాదాపు 10 రోజుల నుంచి శ‌శికళ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె‌ ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉండ‌డంతో ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమెను చూసేందుకు ఆసుప‌త్రి వ‌ద్ద‌కు ప్ర‌జ‌లు భారీగా త‌ర‌లివ‌చ్చారు.

ఆమెకు ఇప్పుడు ఎలాంటి క‌రోనా‌ లక్షణాలు లేవని వైద్యులు ఇప్ప‌టికే తెలిపారు. త్వ‌ర‌లో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆమె విడుద‌లవుతుండ‌డంతో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఆమె నేరుగా పోయెస్ గార్డెన్ వ‌ద్ద‌కు వెళ్లే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.
Sasi kala
Tamilnadu
jayalalitha

More Telugu News