కామినేని ఆసుప‌త్రికి వెళ్లి డి. రాజాను ప‌రామ‌ర్శించిన ప‌లువురు నేత‌లు

31-01-2021 Sun 11:53
  • నిన్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజాకు అస్వ‌స్థ‌త‌
  • పరామ‌ర్శించిన‌ నారాయణ, చాడ, ఎమ్మెల్సీ కవిత
  • ఆయన ఆరోగ్య‌ నిలకడగానే ఉందన్న‌ వైద్యులు
d raja joins in hospital
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఆసుప‌త్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్నారు. కింగ్‌ కోఠీలోని కామినేని ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోన్న ఆయ‌న‌ను ఈ రోజు ఉద‌యం ప‌లువురు నేత‌లు ప‌రామ‌ర్శించారు.  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఆసుప‌త్రికి వ‌చ్చి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆయ‌న‌కు అందిస్తోన్న‌ చికిత్స గురించి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ క‌విత‌ ట్వీట్ చేశారు.
  
కాగా, హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సీపీఐ జాతీయ సమితి సమావేశాలు మొన్న‌ ప్రారంభయయ్యాయి. నిన్న సాయంత్రం డి. రాజా ఇందులో పాల్గొన్నారు. అనంత‌రం అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయన ఆరోగ్య‌ నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. డి. రాజాకు చికిత్స అందుతోన్న నేప‌థ్యంలో నారాయ‌ణ స‌హా ప‌లువురు సీపీఐ నేత‌లు అక్క‌డే ఉంటున్నారు.