Amit Shah: ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా అమిత్ షా కుమారుడు జై షా

  • ఏకగ్రీవంగా ఎన్నికైన జై షా
  • ఇప్ప‌టివ‌ర‌కు ఈ ప‌ద‌విలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్మల్
  • రెండేళ్ల పాటు ఆ పదవీ బాధ్యతలు చేపట్టనున్న జైషా
jay shah elects as acc president

ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఏకగ్రీవంగా ఎన్నికైన‌ట్లు ఏసీసీ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ప‌ద‌విలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్మల్ హసన్ ఉన్నారు. ఆయ‌న‌ పదవీకాలం ముగియ‌డంతో జై షా రెండేళ్ల పాటు ఆ పదవీ బాధ్యతలు చేపడుతున్నారు.

సాధార‌ణంగా ఆ ప‌ద‌వికి సంబంధించి భారత్ వంతు వచ్చినప్పుడు  బీసీసీఐ అధ్యక్షుడే ఈ పదవి చేపడతారు. అయితే, చరిత్రలో తొలిసారి బీసీసీఐ కార్యదర్శి  ఈ బాధ్యతలు చేపడుతుండ‌డం గ‌మ‌నార్హం.  ఆసియా కప్‌ టోర్నమెంట్లను నిర్వహించడంలో ఏసీసీ కీలక పాత్ర పోషిస్తుంది.

కాగా, కరోనా  కారణంగా ఆసియా కప్‌ 2020‌ ఈ ఏడాది జూన్‌కు వాయిదా పడిన విష‌యం తెలిసిందే.  పాకిస్థాన్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండ‌గా, వేదిక‌ను మార్చి శ్రీలంక లేక‌ బంగ్లాదేశ్‌లో నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు.

More Telugu News