David Warner: డేవిడ్‌ వార్నర్‌ కూతురికి జెర్సీ పంపిన కోహ్లీ.. ఫొటో పోస్ట్ చేసిన వార్నర్

davidwarner daughter receives gift fromkohli
  • ఆమె విరాట్ కోహ్లీకి వీరాభిమాని
  • గ‌తంలో చాలా సార్లు చెప్పిన‌‌ వార్నర్‌
  • త‌న కూతురు చాలా ఆనందంగా ఉందని వ్యాఖ్య‌
టిక్‌టాక్ వీడియోల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత దగ్గ‌రైన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ కూతురు ఇండిరేకు టీమిండియా సార‌థి‌ విరాట్‌ కోహ్లీ ఓ బ‌హుమ‌తి పంపాడు. ఆమె విరాట్ కోహ్లీకి వీరాభిమాని అన్న విష‌యం చాలామందికి తెలిసిందే. ఈ విష‌యాన్ని వార్నర్‌ గతంలో చాలా సార్లు చెప్పాడు. తన కూతురు పెద్ద‌య్యాక‌ కోహ్లీలా అవ్వాలనుకుంటోందని కూడా తెలిపాడు.

ఈ నేప‌థ్యంలోనే ఆమెకు కోహ్లీ తన టెస్టు జెర్సీని ఆమెకు ఇచ్చాడు. ఈ విషయాన్ని డేవిడ్ వార్నర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుపుతూ, ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. ఇటీవ‌ల  భార‌త్ తో జ‌రిగిన టెస్టు సిరీస్ ను ఓడిపోయామ‌ని, అయితే, త‌న కూతురు మాత్రం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు.

ఈ జెర్సీ ఇచ్చినందుకు కోహ్లీకి ధన్యవాదాలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నాడు. ఇది ఇండీకి బాగా నచ్చిందని చెప్పాడు. త‌న ఆట‌, ఆరోన్‌ ఫించ్‌ ఆటతో పాటు కోహ్లీ ఆట అంటే ఆమెకు చాలా ఇష్ట‌మ‌ని మ‌రోసారి తెలిపాడు. కాగా, కోహ్లీకి కూడా కూతురు పుట్టిన నేప‌థ్యంలో ఆయ‌న ఇటీవ‌ల జ‌రిగిన టెస్టు మ్యాచుల్లో ఆడ‌లేదు.
David Warner
Cricket
Australia
India
Virat Kohli

More Telugu News