Delhi Blast: ఢిల్లీ పేలుడు మా పనే: జైష్ ఉల్ హింద్

Jaish Ul Hind claims for Delhi blasts
  • నిన్న ఢిల్లీలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద పేలుడు
  • పేలుడు వెనుక ఇరాన్ హస్తముందనే అనుమానాలు
  • దీనిపై ఇప్పుడే అధికారికంగా ఆరోపణలు చేయలేమన్న కేంద్రం
ఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద నిన్న జరిగిన పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు తామే కారణమని ఉగ్రసంస్థ జైష్ ఉల్ హింద్ ప్రకటించుకుంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈ సదరు ఉగ్రసంస్థ ప్రకటనను గుర్తించినట్టు తెలుస్తోంది.

మరోవైపు పేలుడు ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఢిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయంలో ఈ రోజు కీలక సమావేశం జరిగింది. పేలుడుకు కారణమైన ఉగ్రసంస్థ క్రియాశీల సభ్యుల సమాచారం సేకరించాలని ఈ సమావేశంలో ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. స్లీపర్ సెల్స్ వివరాలను కూడా సేకరించాలని ఆదేశించారు. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్ పేలుడు ఘటన దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు, ఈ ఘటన వెనుక ఇరాన్ హస్తం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, దీని వెనుక ఇరాన్ ఉందనే ఆరోపణలను అధికారికంగా చేయలేమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేసు దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చాక దీనిపై కేంద్రం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Delhi Blast
NIA
Jaish Ul Hind

More Telugu News