KK: పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు కేంద్రానికి మద్దతిస్తాం: కేకే

  • రాష్ట్ర ప్రయోజనాలకు అవరోధంగా నిలిచే పనులను ఎప్పుడూ చేయం
  • రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం
  • రాష్ట్రం కోసం ఎవరితో స్నేహం చేయడానికైనా సిద్ధమే
We support to conduct Parliament sessions smoothly says KK

ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అనేది టీఆర్ఎస్ పార్టీ విధానం కాదని ఆ పార్టీ నేత, ఎంపీ కేకే అన్నారు. తమకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాలకు అవరోధంగా నిలిచే పనులను ఎప్పుడూ చేయమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితో స్నేహం చేయడానికైనా రెడీ అని చెప్పారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు.

ఢిల్లీలో ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశానికి 18 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ చట్టాలకు సంబంధించిన అంశాన్ని పలు పార్టీలు లేవనెత్తాయి. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేకే ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని చెప్పారు. రైతు చట్టాలను తాము వ్యతిరేకించామని తెలిపారు. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో జరిగిన ఘటనలు సరికాదని తెలిపారు. ఈ ఘటనను సాకుగా చూపి రైతుల సమస్యలను విస్మరించకూడదని చెప్పారు.

More Telugu News