Nara Lokesh: పాస్టర్ కిశోర్ పై వైసీపీ రౌడీలు దాడి చేయడం బాధాకరం: నారా లోకేశ్

Attack on Pastor Kishor is inhuman says Nara Lokesh
  • మంగళగిరి నియోజకవర్గంలో పాస్టర్ పై దాడి
  • దాడిని ఖండిస్తున్నామన్న లోకేశ్
  • దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్
మంగళగిరి నియోజకవర్గం, పెనుమాక గ్రామంలో పాస్టర్ కిశోర్ పై వైసీపీ రౌడీలు దాడి చేయడం బాధాకరమని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. పెనుమాక గ్రామంలో ఈ దాడి జరిగింది. 30 ఏళ్లుగా క్రీస్తు మార్గంలో నడుస్తూ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కిశోర్ పై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని లోకేశ్ చెప్పారు. కిశోర్ పెట్టిన కేసును నీరుగార్చే ప్రయత్నాలను ఆపి, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కిశోర్ చేస్తున్న న్యాయపోరాటానికి తాను అండగా ఉంటానని అన్నారు. దాడికి సంబంధించి కిశోర్ మాట్లాడిన వీడియోను లోకేశ్ షేర్ చేశారు.
Nara Lokesh
YSRCP
Mangalagiri
Pastor Kishor

More Telugu News