YSR: వైయస్ రాజశేఖరరెడ్డి ప్రోత్సాహం వల్లే ఈ స్థాయిలో ఉన్నా: నిమ్మగడ్డ రమేశ్

Due to YSR only Iam in this position says Nimmagadda Ramesh
  • వైయస్ ఆశీస్సులు నాకు ఉన్నాయి
  • వైయస్ లో లౌకికవాద ధృక్పథం ఉండేది
  • భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించిన నాయకుడు వైయస్
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ పై వైసీపీ ప్రభుత్వం విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈరోజు నిమ్మగడ్డ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు జగన్ ప్రభుత్వంతో పోరాడుతున్న నిమ్మగడ్డ... జగన్ తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డిపై ప్రశంసలు గుప్పించారు. వైయస్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాను ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చానని చెప్పారు.

వైయస్ దగ్గర పని చేయడం తన జీవితంలో పెద్ద మలుపు అని నిమ్మగడ్డ అన్నారు. ఆయన వద్ద ఫైనాన్స్ సెక్రటరీగా పని చేశానని... ఆయన ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పారు. వైయస్ కు రాజ్యాంగం పట్ల ఎంతో గౌరవం ఉందని అన్నారు. వైయస్ లో లౌకికవాద ధృక్పథం ఉండేదని తెలిపారు.

ఎన్నో అంశాలలో భావప్రకటనా స్వేచ్ఛను కల్పించిన నాయకుడు వైయస్ అని కితాబునిచ్చారు. వైయస్ ఏ రోజు ఏ వ్యవస్థను తప్పు పట్టలేదని చెప్పారు. వైయస్ వద్ద పని చేస్తున్న సమయంలో తాను ఏరోజు ఇబ్బంది పడలేదని అన్నారు. గవర్నర్ కార్యాలయం వల్లే తాను ఎన్నికల అధికారిని అయ్యానని చెప్పారు. 
YSR
Nimmagadda Ramesh
SEC
Jagan
YSRCP
Congress

More Telugu News