pastor praveen chakravarty: పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి బెయిల్ నిరాకరణ

Guntur Court Rejected pastor praveen Chakravarthy
  • ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు
  • తన పనేనన్న పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి
  • బెయిలు నిరాకరించిన గుంటూరు 2వ అదనపు జిల్లా కోర్టు
ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు తన పనేనని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించి అరెస్ట్ అయిన కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి కోర్టు బెయిలు నిరాకరించింది. సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ఆధారంగా పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేసి సీఐడీ, సైబర్ క్రైమ్ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. నిన్న అతడి బెయిలుపై గుంటూరు 2వ అదనపు జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు విన్న న్యాయమూర్తి ఎ. వాసంతి ప్రవీణ్ చక్రవర్తికి బెయిలు నిరాకరిస్తూ తీర్పు చెప్పారు.
pastor praveen chakravarty
Hindu Temples
Attacks
Bail

More Telugu News