Gorantla Butchaiah Chowdary: పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు: గోరంట్ల విమ‌ర్శ‌లు

gorantla slams ycp
  • గ్రామాభివృద్ధికి ఏం కృషి చేశారో చెప్పాలి
  • టీడీపీ హ‌యాంలో మంజూరు అయిన వాటికి కొబ్బరికాయ కొడుతున్నారు
  • గ్రామాల్లో ఏమన్నా కొత్తగా పనులు చేశారా?
  • శాంతి పూర్వక వాతావరణంపై దృష్టి పెట్టడం లేదు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి విమ‌ర్శ‌లు గుప్పించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌ల్లెల‌కు వైసీపీ స‌ర్కారు ఏం చేసిందో చెప్పాల‌ని ఆయ‌న నిల‌దీశారు.

'వైసీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామ అభివృద్ధికి ఏం కృషి చేసిందో చెప్పాలి. తెలుగుదేశం హ‌యాంలో మంజూరు అయిన వాటికి కొబ్బరికాయ కొట్టడం తప్ప గ్రామాల్లో ఏమన్నా కొత్తగా పనులు చేశారా?
పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ, శాంతి పూర్వక వాతావరణంపై దృష్టి పెట్టడం లేదు' అని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.
Gorantla Butchaiah Chowdary
Telugudesam
Local Body Polls

More Telugu News